Share News

ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష రద్దు

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:55 AM

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ జనరల్‌ సర్జరీ పేపర్‌-1 పరీక్షను రద్దు చేశారు.

ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష రద్దు

  • ఈ నెల 27న తిరిగి పరీక్ష నిర్వహణ

వరంగల్‌ మెడికల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ జనరల్‌ సర్జరీ పేపర్‌-1 పరీక్షను రద్దు చేశారు. ఈ విషయాన్ని గురువారం ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. ఈ పేపర్‌ను తిరిగి ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం జరిగిన పేపర్‌-1 పరీక్ష ప్రశ్నపత్రంలో 33 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు పేపర్‌-2కు సంబంధించినవి రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష రద్దు ప్రకటన వెలువడింది. గతంలో కూడా పీజీ ఫోరెన్సిక్‌ విభాగంలో పాత ప్రశ్నలే తిరిగి ఇవ్వడంతో వివాదం తలెత్తింది.

Updated Date - Apr 17 , 2026 | 03:55 AM