kumaram bheem asifabad- ఎంబీ రికార్డులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:19 PM
ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన పనుల ఎంబీ రికార్డులు త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ దత్తారావ్ అన్నారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో మంగళవారం సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న మార్చి నెలకు సంబంధించిన ఎండీలు పూర్తి చేసి బిల్లులు నమోదు చేసిన వెంటనే వాటిని మంజూరు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉప యోగ పడుతుంద చెప్పారు
జైనూర్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన పనుల ఎంబీ రికార్డులు త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ దత్తారావ్ అన్నారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో మంగళవారం సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న మార్చి నెలకు సంబంధించిన ఎండీలు పూర్తి చేసి బిల్లులు నమోదు చేసిన వెంటనే వాటిని మంజూరు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉప యోగ పడుతుంద చెప్పారు. కూలీలకు నిత్యం పనులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా 2024-2025 సంత్సరానికి గాను నిర్వహించిన ప్రజావేదికలో సీసీటీలు, డ్రైవర్షన్ స్ట్రెంచెస్, హార్టీకల్చర్, పీటీసీ తదితర రకాల పనులు నిర్వహించిన వాటిపై తనిఖీ చేపట్టారు. పనుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడం, పలు చోట్ల చెట్లు ఎండి పోవడంతో దీనికి బాధ్యులైన సిబ్బంది నుంచి రూ. 2.23 లక్షలు రికవరీ చేయాలని దత్తారావ్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఏపీవో నగేష్, ఉపాధి హామీ సిబ్బంది, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.