కార్మికుల పోరాట ఫలం ’మే’ డే...
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:49 PM
విశ్వంలో ప్రతిరోజూ ప్రతి పని సక్రమంగా జరుగాలంటే...అందుకు కారణం కార్మికుడే. కార్మికుడు తన చెమట చుక్కలను చిం దించి, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. ’మే’ డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
-నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
-కన్నుల పండువగా ఉత్సవాలు
-రెపరెపలాడనున్న ఎర్ర జెండాలు
మంచిర్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): విశ్వంలో ప్రతిరోజూ ప్రతి పని సక్రమంగా జరుగాలంటే...అందుకు కారణం కార్మికుడే. కార్మికుడు తన చెమట చుక్కలను చిం దించి, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం. ’మే’ డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ’మే’ డేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. కార్మిక క్షేత్రాలంటే ముందుగా గుర్తుకు వచ్చేవి సింగరేణి బొగ్గు గనులు, వాటిలో పని చేసే కార్మికులు. అలాగే దేవా పూర్ సిమెంట్ కంపెనీ, జైపూర్ పవర్ ప్లాంట్‌తోపాటు సం ఘటిత, అసంఘటిత కార్మికులు పని చేసే సంస్థలన్నీ గుర్తు కు వస్తాయి. ఆయా రంగాల కార్మికుల హక్కులను గుర్తు చేస్తూ ఉత్సవాలు జరుపుకునే రోజునే ’మే’ డేగా పిలుస్తుంటారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు....
19వ శతాబ్దంలో పరిశ్రమల్లో పని చేసేందుకు అసంఖ్యా కంగా కార్మికుల అవసరం ఏర్పడింది. పెట్టుబడి దారులు శ్రామికులతో బానిసల్లాగా పని చేయించి అధిక లాభాలు పొందుతుండేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కల్పించకుండా కనీసం రోజుకు 16 నుంచి 20 గంట లు పని చేయించేవారు. పని స్థలాల్లో సరియైన గాలి, వెలు తురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికులు ప్రమాదా లకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితికి భిన్నంగా, శ్రమదోపిడీ నుంచి బయటపడేందుకు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించుకున్న రోజే ’మే’ డే. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ ఎనిమిది గంటల పని దినం అమల్లోకి రావడంతో జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం.
హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం....
’మే’ డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంత మంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గా లకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషు లమే...మా శక్తికి కూడా పరిమితులుంటాయి....ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి చివరకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిద ర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంట లు విశ్రాంతి, ఎనిమిది గంటలు రిక్రియేషన్ అన్న పద్ధతిని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకున్నారు. చికాగో పోరా టం కంటే ముందే భారత దేశంలో కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్‌లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రైల్వే కార్మికులు 10 గంటలు పని చేసేవారు. అయితే ఆ పోరాటం విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారకపోవడంతో ఉద్యమ స్వరూపాన్ని అందుకో లేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైం ది. 1923లో మొదటిసారిగా భారత దేశంలో ’మే’ డేను పా టించారు. అప్పటి నుంచి ప్రతి యేడు కార్మికులు ఐక్యంగా ’మే’ డేను పాటిస్తున్నారు. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాలు కార్మిక చట్టాల అమలుకు నోచు కోవడం లేదు. మార్కెట్‌లో శక్తులు ఎక్కడ శ్రమను దోచు కునే అవకాశం ఉందో అక్కడే కంపెనీలు పెట్టేవారు. అమెరి కాలో ఉన్న కంపెనీలు అక్కడ ప్రజా చైతన్యం ఉన్నది కాబ ట్టి... కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపె నీలు పెడుతూ కార్మికులతో 10 నుంచి 12 గంటల వకు పని చేయించేవారు. ఇప్పటికీ దేశంలో అక్కడక్కడ ఈ శ్రమ దో పిడీ కళ్లకు గట్టినట్లు కనిపిస్తుంటుంది. వివిధ రంగాల్లో వి ద్యావంతులైన యువత నేడు అధిక శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ సర్వ సాఽధారణం. కార్మిక చట్టాలను పారిశ్రామిక రంగంలో అమ లు కోసం పోరాటం అవసరం. కార్మిక చట్టాలు అమలు చే యబోమని పాలక వర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీ లిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటిత రంగంలో అయితే ఇది మరింతగా విస్తరించింది. ప్రభుత్వాలు కాంట్రా క్టు, పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్ సోర్సింగ్ విధానంలోనూ కార్మిక చట్టాల నియమాలు అమలు కావ డం లేదు. పైగా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సం ఖ్యను తగ్గిస్తూ కాంట్రాక్టీరణ చేపడుతున్నారు. ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తగ్గుముఖం పడుతోంది. ఫలి తంగా శ్రమదోపిడీ పెరుగుతోంది. ప్రపంచీకరణ వల్ల వందల ఏళ్ల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా నేడు అమలు కు నోచుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 1886లో ఆరం భమైన ఈ ఉద్యమం నేడు 138 ఏళ్ల పండుగ జరుపుకో బో తోంది.
ఏర్పాట్లలో కార్మికులు...
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకు నేందుకు సంఘటిత, అసంఘటిత కార్మికులు సన్నద్ధం అవు తున్నారు. వివిధ రంగాలకు చెందిన కార్మికులతో వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింగరేణి గనులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, హమలి సంఘం, ఇఫ్టూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, కూరగాయల కార్మిక సంఘం, సీపీఐ, ఆధ్వర్యంలో ఆయా సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొననున్నారు.