Share News

మంచిర్యాలకు భారీగా నిధులు...

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:11 PM

మంచిర్యాల అభివృద్ధికి రాబోయే రోజుల్లో అధిక మొత్తం నిధులు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

మంచిర్యాలకు భారీగా నిధులు...
ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పాల్గొన్న వ్యాపారస్తులు

-దూరదృష్టిగల నాయకుడు ప్రేంసాగర్‌రావు

-రాష్ట్రంలోనే మంచిర్యాల మోడల్‌ను అమలు చేస్తాం

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

మంచిర్యాల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల అభివృద్ధికి రాబోయే రోజుల్లో అధిక మొత్తం నిధులు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేంసాగర్‌రావు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ధరణి మధూకర్‌తో కలిసి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధుల సంకల్పం, నిబద్దత వల్లే అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావును ఉద్దేశించి అన్నారు. శనివారం మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావుతో కలిసి మంచిర్యాల పట్టణంలో పర్యటించారు. ఇక్కడి రోడ్ల విస్త రణ, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ పనులను చూసి సంతోషం వేసిం దన్నారు. అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఇక్కడి పనులు నిరూపిస్తున్నాయన్నారు.

మంచిర్యాల మోడల్‌ను అమలు చేస్తా....

రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల మోడల్‌ను అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల తరువాత మంచిర్యాలకు దొరికిన నిజమైన విజనరీ ఉన్న లీడర్‌ ప్రేంసాగర్‌రావు అని కొనియాడారు. తన సొంత ని యోజకవర్గంలో నిధులు విడుదల అయినప్పటికీ కొన్ని పనులు చేయలేక పోయానని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అందుకే రాష్ట్రంలోని ఇతర ము నిసిపాలిటీల ప్రజా ప్రతినిధులు, కమిషనర్లను ఇక్కడికి పంపించి, అభి వృద్ధిని ఒక మోడల్‌గా తీసుకొని స్పూర్తి పొందేలా చేయాలని అక్కడే ఉన్న ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో అన్నారు. ఇక్కడ చేపట్టిన హాస్పి ట ళ్లు, స్కూళ్ల నిర్మాణం అద్భుతంగా ఉన్నాయన్నారు. గతంలో తాను పాద యాత్ర చేసినప్పుడు వరద ముప్పు ఉన్న ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిం చడంవల్ల గర్భిణులు ఎదుర్కొన్న ఇబ్బందులను చూశానన్నారు. ప్రభుత్వం రాగానే మంచిర్యాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కడతామని మాట ఇచ్చామన్నారు. అన్నట్లుగానే చాలా వేగంగా అవసరమై ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఇక్క డి 50 పడకల ఆసుపత్రి అర్కిటెక్చర్‌, విశాలమైన వరండాలు, గాలి వె లుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి...మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెం ట్‌ వారిని పరిశీలించమని చెప్పానన్నారు. ఇదే మోడల్‌ 50 పడకల హాస్పిటల్‌ను తన నియోజక వర్గానికి మంజూరు చేయించుకున్నట్లు తె లిపారు. దూరధృష్టిగల నాయకత్వం దొరకడం మంచిర్యాల ప్రజల అదృ ష్టమని, ఒక ప్రాంతానికి 50, 100 ఏళ్ల భవిష్యత్తును అలోచించి, దూర దృష్టితో పునాదులు వేసేవాడే నిజమైన నాయకుడన్నారు. అలాంటి నా యకత్వం మంచిర్యాలలో ఉండటం వల్లనే విద్య, వైద్యం, దేవాలయాలు, ఇరిగేషన్‌, తదితర రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందన్నారు.

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపు...

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో కేంధ్రం కాంగ్రెస్‌ ఓట్లు తొలగిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. తద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జిల్లా కేంద్రం లో సర్‌పై ఏర్పాటు చేసిన బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. మొన్నటి పక్క రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజ యం వెనుక కాంగ్రెస్‌ ఓట్ల తొలగింపే కారణమన్నారు. బీఎల్‌ఏలు ఓటరు జాబితాలో ఉన్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఓటర్‌గా నమోదైన వారి పట్ల నిజ నిర్దారణ చేయాలన్నారు. గతంలో ఓటర్‌ లిస్ట్‌లో పేరు లే కపోతే ఓటు వేయకుండానే వెనుదిరిగేవారని, ప్రస్తుతం పేరులేకపోతే దేశ పౌరస త్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కేవలం కాంగ్రెస్‌ ఓట్లను టార్గెట్‌ చేసి మరీ తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియ పట్ల బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మ్యాపింగ్‌ చేసిన జాబితా నుంచి కూడా మారు పేర్ల పేరిట తొలగించే కుట్రలు జరుగుతు న్నాయన్నారు. ఓటర్లను తొలగించే కార్యక్రమం దేశంలో పెద్ద ఎత్తున జరు గుతోందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమాలలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నగర అధ్యక్షుడు తూముల నరేష్‌, పట్టణంలోని వివిధ రంగాల వ్యాపారస్థులు, బీఎల్‌ఏలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 11:11 PM