Share News

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజాపోరాటాలు

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:32 PM

వీర తెలంగా ణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా పోరాటాలు చేపడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు.

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజాపోరాటాలు
బిజినేపల్లి ఫూలే-అంబేడ్కర్‌ చౌరస్తాలో సీపీఎం జెండాను ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న పర్వతాలు

- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు

బిజినేపల్లి/ తెలకపల్లి/ పెంట్లవెల్లి, సె ప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వీర తెలంగా ణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా పోరాటాలు చేపడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. బి జినేపల్లిలోని ఫూలే-అంబేడ్కర్‌ చౌరస్తాలో మంగళవారం బైక్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభించి ఆయన మాట్లాడారు. కమ్యూ నిస్టులు, ఆంధ్రమహాసభ నాయకులతో కలి సి భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల వి ముక్తి కోసం సాయుధ పోరాటం చేపట్టారని గు ర్తు చేశారు. వారి పోరాట స్ఫూర్తితో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పో రాటం చేస్తామన్నారు. అనాటి సాయుధ పోరా టాన్ని మతతత్మ పార్టీలు హిందూ ముస్లిం పో రాటాలుగా చిత్రీకరిస్తే సహించేది లేదని పేర్కొ న్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యు డు ఆర్‌.శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎం.శ్రీ నివాస్‌, అశోక్‌, లక్ష్మణ్‌, రామయ్య, మధు, కాశ న్న, భాస్కర్‌, సత్యనారాయణ, మల్లేష్‌, రమేష్‌, సుధాకర్‌, వెంకటేష్‌, శ్రీశైలం, శివరాం ఉన్నారు.

తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామంలో లింగోజీరావు స్తూపానికి సీపీఎం జిల్లా కార్య దర్శివర్గ సభ్యుడు ఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నివాళులర్పించారు. అనంతరం గ డ్డంపల్లి, అనంతసాగర్‌ బండపల్లి, దాస్‌పల్లి గ్రా మాల మీదుగా బైక్‌ ర్యాలీ తెలకపల్లికి చేరుకొం ది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార సులు కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. కా ర్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీను, రామయ్య, అశోక్‌, నాయకులు గోపాస్‌ ల క్ష్మణ్‌, నాగపూర్‌ మధు, అంతటి కాశన్న, మం డల నాయకులు నందిపేట భాస్కర్‌, సీనియర్‌ నాయకులు విజయ్‌గౌడ్‌, కాసన్న, శివరాం, మనోహర్‌, ఆచారి పాల్గొన్నారు.

మాంకాలమ్మ మిట్టలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

పెంట్లవెల్లిలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెంట్లవె ల్లిలో సర్వే నెంబర్‌ 22, 27లో మాంకాలమ్మ మిట్టలో 14 ఎకరాల 36 గుంటల భూమిలో 20 ఏళ్ల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆ యన తెలిపారు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణా రావు చొవర తీసుకొని ఆ భూమిని అన్యాక్రాం తం కాకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇంది రమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌. హనుమంతు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మధు, నాయకులు శ్రీనివాసులు, తిమ్మస్వామి, గోపాల్‌, కేశవులుగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2026 | 11:32 PM