క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:03 AM
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
భువనగిరి టౌన్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో సోమ వారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామా నికి చెందిన లచ్చుపోతు లక్ష్మీనాయుడుకి 2018లో లలితతో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు, ఏడాదిన్నర వయసు గల కుమార్తె ఉన్నారు. లక్ష్మీనాయుడు భువనగిరి పట్టణ శివారులోని ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి స్థానిక హౌసింగ్‌బోర్డుకాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. పలు కారణాలతో దంపతులిద్దరూ తరుచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికి రాజీపడ్డారు. అనంతరం లక్ష్మీనాయుడు పిల్లలతో కలిసి మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వచ్చేసరికి లలిత(30) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లలితను జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించడంతో అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్లారు. మార్కెట్‌కు వెళ్లే ముందు వరకూ మాట్లాడి, అరగంటలోపే ఫ్యాన్‌కు వేలాడుతున్న తల్లిని చూసిన పిల్లల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.