Share News

kumaram bheem asifabad- కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:40 PM

శ్రీరామనవమి వేడుకలను పురస్క రించుకొని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ కోదండ రామాలయంలో సీతారాముల కల్యా ణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుడు నిమ్మకంటి సంతోష్‌శర్మ ఆధ్వర్యంలో పురోషితులు శీరిష్‌శర్మ, రాజశేఖరశర్మ, మహేష్‌శర్మ, పూర్ణ చందర్‌, అభయ్‌ ఆచార్య, నరేష్‌శర్మ, విజ య్‌కుమార్‌, అనంద్‌ అచార్య, తిరుపతి చారి కల్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణవాడలోని కేశవనాథ ఆలయం నుంచి జన్కాపూర్‌లోని కోదండరామాల యం వరకు ఉత్సవ విగ్రహలతో శోభాయాత్ర నిర్వహించారు.

kumaram bheem asifabad- కల్యాణం.. కమనీయం
పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే తనయుడు కోవ సాయి దంపతులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 27 (ఆంధ్ర జ్యోతి): శ్రీరామనవమి వేడుకలను పురస్క రించుకొని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ కోదండ రామాలయంలో సీతారాముల కల్యా ణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుడు నిమ్మకంటి సంతోష్‌శర్మ ఆధ్వర్యంలో పురోషితులు శీరిష్‌శర్మ, రాజశేఖరశర్మ, మహేష్‌శర్మ, పూర్ణ చందర్‌, అభయ్‌ ఆచార్య, నరేష్‌శర్మ, విజ య్‌కుమార్‌, అనంద్‌ అచార్య, తిరుపతి చారి కల్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణవాడలోని కేశవనాథ ఆలయం నుంచి జన్కాపూర్‌లోని కోదండరామాల యం వరకు ఉత్సవ విగ్రహలతో శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయు డు కోవసాయినాథ్‌-హరిక దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారా ముల కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో హను మాన్‌ దీక్ష స్వాములు, భక్తుల ‘‘జై శ్రీరాం’’ నినాదాలతో మారుమోగింది. వేదపండితుడు నిమ్మకంటి సంతోష్‌శర్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోదండ రామాలయం అవరణలో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకలకు ముఖ్య అతిఽథిగా కలెక్టర్‌ కె హరిత హాజరయ్యారు. కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను కలెక్టర్‌ అభినందించారు. మైనార్టీలు, కౌన్సిలర్‌ వినోద్‌, వాసవిక్లబ్‌, సాయిని లక్ష్మయ్య స్మారకార్థం, కాట్‌కార్‌ బాలాజీ, సంతోషిమాత వాటర్‌ప్లాం ట్‌ నిర్వహకులు, విష్ణుగ్రాండ్‌ లాడ్జి నిర్వహ కులు, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా సీఐ బాలాజీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు కొమరయ్య, కమలాకర్‌, బొజ్జిరావు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్‌ చైర్మన్‌ మెంగ్రె అకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మ ద్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఇరుకుల్ల మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, కౌన్సిలర్లు వెం కన్న, భారతి, దూడల లక్ష్మి, వినోద్‌, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, ఖండ్రే విశాల్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, మార్కె ట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, సర్పంచులు పోచయ్య, రాజన్న, ఆలయ కమి టీ అధ్యక్షుడు సత్యనారాయణ, కమిటీ సభ్యులు భద్రయ్య, శైలేందర్‌, యాదగిరి, చం దు, జగన్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 10:40 PM