kumaram bheem asifabad-కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:23 PM
గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర ఆలయం వద్ద మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శని వారం నుంచి గంగాపూర్ జాతర మహోత్స వాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం బాలాజీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ముందు భాగంలో ఉన్న గంగాపూర్ వాగులో ఏర్పాటు చేసిన స్వామి కల్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్య లో భక్తులు హాజరయ్యారు.
- మొదటి రోజు వేంకటేశ్వర కల్యాణం
- పాల్గొన్న కలెక్టర్ దంపతులు, ఎస్పీ
- నేడు రథోత్సవం
రెబ్బెన, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర ఆలయం వద్ద మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శని వారం నుంచి గంగాపూర్ జాతర మహోత్స వాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం బాలాజీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ముందు భాగంలో ఉన్న గంగాపూర్ వాగులో ఏర్పాటు చేసిన స్వామి కల్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్య లో భక్తులు హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, భాజాభజంత్రీలతో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు గర్భగుడి నుంచి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు.
- టీటీడీ నుంచి పట్టువస్త్రాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వయంగా కలెక్టర్ కె హరిత దంపతులు కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. వేపండితుల మంత్రో చ్ఛరణల మధ్య భక్తజన సందోహం మధ్య కల్యాణం నిర్వహించారు. గంగాపూర్ జాతర లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వరస్వామి ఇక్కడికి వచ్చి భక్తుల కోరికలు తీరుస్తారని ప్రజలు విశ్వాసం. దీంతో ఆదివారం జాతరకు పెద్ద ఎకుత్తన భక్తులు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6.15 గంటలకు గంగాపూర్ వాగులో రథోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితికా పంత్, జీఎం శ్రీనివాస్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సర్పంచ్ వెంకటేష్ చేతుల మీదుగా కల్యాణం నిర్వహించారు. కలెక్టర్ కె హరిత మాట్లాడు తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసేకో వాలని చెప్పారు. ఆదివారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులతో పాటు అధికారులు, పోలీసులకు సూచించారు. తాగు నీటి సౌకర్యం ఎక్కడికక్కడా ఏర్పాటు చేయా లని చెప్పారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు ఉండకుండా త్వరిగతిన స్వామి వారి దర్శనాలు చేయించి పంపించాలని సూచించా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, తహసీల్దార్ సూర్యప్రకాష్, ఎంపీడీవో శంకరమ్మ, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణతో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.