kumaram bheem asifabad- ఘనంగా మార్కండేయ జయంతి
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:19 PM
మార్కండేయ జయంతిని పురుస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఉత్తరవాహిణి నది తీరంలో ఉన్న భక్త మార్కండేయ ఆలయంలో వేదపండితులు నాగేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు
ఆసిఫాబాద్/రెబ్బెన/వాంకిడి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మార్కండేయ జయంతిని పురుస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఉత్తరవాహిణి నది తీరంలో ఉన్న భక్త మార్కండేయ ఆలయంలో వేదపండితులు నాగేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. మహిళలు భక్తి గీతాలు, కోలాటం అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఈ శోహయాత్ర ఆలయం నుంచి ప్రారంభమై సాయిబాబా ఆలయం, అంబేద్కర్ చౌక మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. రెబ్బెన మండలం గోలేటిలో పద్మశాలి వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో బుధవారం మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు రాజమల్లు, వెంకటేశ్వర్లు, వీరస్వామి, చందర్, శంకర్, కైలాసం, అనీల్‌కుమార, సమ్మయ్య, సాయికిరణ్, రవీందర్, శ్రీనివాస్, సరస్వతి, స్వరూపరాణి, వెంకటలక్ష్మి, శారద, రుచిత, రాణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రంలో మార్కండేయ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సతీష్, పెంటయ్య, రామకృష్ణ, రాకేష్‌కుమార్, రాజు, సాయి, విఘ్నేష్, సాయికిరణ్, ప్రశాంత్, సాయి పవన్, సాయిప్రణీత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.