kumaram bheem asifabad- బంతి పూల సాగు.. ఆదాయం బాగు
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:34 PM
సాధారణ పంటలకు భిన్నంగా పూల సాగు వైపు మళ్లిన రైతులకు కాసుల పంట పండుతోంది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా సరైన వర్షాలు ఉండవని ప్రారం భంలోనే అధికారులు సూచించగా, మండలానికి చెందిన కొంత మంది రైతులు బంతిపూల సాగుబాట పట్టారు. మండలంలోని ఎల్కపల్లి, హేటిగూడ, కోర్తెగూడ తదితర గ్రామాలకు చెందిన రైతులు బంతిపూల సాగు చేసి ఆర్థికంగా లాభాలను ఆర్జిస్తున్నారు.
- తక్కువ పెట్టుబడితో లాభాలు ఉంటాయని చెబుతున్న రైతులు
బెజ్జూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సాధారణ పంటలకు భిన్నంగా పూల సాగు వైపు మళ్లిన రైతులకు కాసుల పంట పండుతోంది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా సరైన వర్షాలు ఉండవని ప్రారం భంలోనే అధికారులు సూచించగా, మండలానికి చెందిన కొంత మంది రైతులు బంతిపూల సాగుబాట పట్టారు. మండలంలోని ఎల్కపల్లి, హేటిగూడ, కోర్తెగూడ తదితర గ్రామాలకు చెందిన రైతులు బంతిపూల సాగు చేసి ఆర్థికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా, దీపావళి పండగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో బంతిపూలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ క్రమంలో రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారు. వరుస పండగల నేపథ్యంలో బంతిపూలకు మంచి డిమాండ్ పెరుగుతుండడంతో రైతులు బంతిపూల సాగును ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో సాగు చేపడుతు న్నట్లు రైతులు పేర్కొంటున్నారు. బంతిపూల మొక్కలను కరీంనగర్ నుంచి ఒక్కో మొక్కకు రూ.5చొప్పున కొనుగోలు చేసి తీసుకవచ్చినట్లు రైతులు అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బంతిపూల సాగును మండలంలో గత నాలుగేళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ఎకరాకు 50వేలు పెట్టుబడి పెడితే 3లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. మొక్కలకు సకాలంలో ఎరువులు, పురుగుల మందు పిచికారి చేయడంతో పంట పుష్కలంగా పెరిగి బతుకమ్మ పండగకు అందుబాటులోకి వస్తుందని రైతులు తెలుపుతున్నారు.
- గతంలో బతుకమ్మలకు..
ఒకప్పుడు బతుకమ్మ సీజన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బంతిపూలు దొరకకపోవడంతో పట్టణాల నుంచి తీసుకొచ్చేవారు. పట్టణ వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి పూలు దిగుమతి చేసుకొని విక్రయాలు చేసేవారు. క్రమంగా పల్లె ప్రాంత రైతులు బంతిపూ లకు ఉన్న డిమాండ్‌ను చూసి సాగు చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నాలుగేళ్లుగా బంతి పూల సాగు చేసి లాభాలను గడిస్తున్నారు. పండగల వేళ పూలకు మంచి డిమాండ్ ఉంటుండడంతో రైతులు పూలసాగు బాట పట్టారు. తక్కువ పెట్టుబడితో పాటు పంట కాలం కూడా తక్కువగా ఉండడం, ఆ తర్వాత ఇతర పంటలు కూడా సాగు చేసే అవకాశం ఉండటంతో రైతులు పూలసాగుపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రైతులు ఎక్కువ మొత్తంలో వాణిజ్య పంటలు సాగు చేస్తూ అవసరాల సాగు అయిన కూరగాయలు, పప్ప దినుసుల సాగును పూర్తిగా మానేయడంతో వాటికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఇదే అదునుగా భావించిన రైతులు వినూత్నంగా భావించి అధిక ఆదాయాన్ని సమ కూర్చుకునేందుకు పూలసాగుకు శ్రీకారం చుట్టారు. సీజన్‌కు అనుగు ణంగా వినూత్న పంటలు సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం పూలకు ఉన్న డిమాండ్ మేరకు పండు గలకు ఉన్న ప్రాధాన్య తను గుర్తించి సాగుబాట పట్టారు. ఏ శుభకార్యంలోనైనా పూలకు ఉండే ప్రాధా న్యం చెప్పనక్క ర్లేదు. దీంతో బంతిపూల సాగుకు శ్రీకారం చుట్టారు.
అర ఎకరం సాగు చేశాం..
- కోర్తె నందరాం, రైతు, కోర్తెగూడ
ఈ ఏడాది అర ఎకరంలో బంతిపూల సాగు చేశాను. పూల సాగుకు రూ. 30వేల వరకు ఖర్చు చేశాను. బంతిపూలు కూడా బాగా రావడంతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. బతుకమ్మ, దసరా, దీపావళి పండగలకు పూలను గ్రామాలు, పట్టణాల్లో విక్రయిస్తాం. పూలసాగుకు అధిక ఖర్చులు కూడా ఉండవు. అమ్మకాలు ఆశాజనకంగా లాభదాయకం గానే ఉంటాయి.