Share News

Prasadam Delivery: ఇంటివద్దకే మేడారం ప్రసాదం

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:08 AM

మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తులకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సేవలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం...

Prasadam Delivery: ఇంటివద్దకే మేడారం ప్రసాదం

  • సమ్మక్క, సారలమ్మ భక్తులకు ఆర్టీసీ సేవలు

హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తులకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సేవలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల ఫోటోలతో సహా పసుపు, కుంకుమ, ప్రసాదం నేరుగా భక్తుల ఇంటికే చేరవేయనుంది. ప్రసాదం ప్యాకెట్‌ పొందాలనుకునే భక్తులు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ లాజిస్టిక్‌ కౌంటర్లలో నేరుగా బుక్‌ చేసుకోవడంతోపాటు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ లో మేడారం ప్రసాదం పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. పేరు, ఫోన్‌ నెంబరు, చిరునామా నమోదు చేసిన తర్వాత యూపీఐ పేమెంట్‌ పద్దతిలో రూ.299 చెల్లిస్తే నేరుగా ఇంటికే మేడారం ప్రసాదం చేరవేస్తారు. మరింత సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నెంబర్లు 040-69440069, 040-23450033లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. మరోవైపు మేడారం జాతర ప్రసాద సేవలు, పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆవిష్కరించారు.

Updated Date - Jan 17 , 2026 | 06:08 AM