Share News

44 ఏళ్ల తర్వాత పెద్దపల్లికి ‘మల్లోజుల’

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:32 AM

మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌ బ్యూరో మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ సోనూ దాదా 44 ఏళ్ల తర్వాత స్వస్థలం పెద్దపల్లిలో....

44 ఏళ్ల తర్వాత పెద్దపల్లికి ‘మల్లోజుల’

  • సోదరుడికి పరామర్శ

  • భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు

పెద్దపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌ బ్యూరో మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ సోనూ దాదా 44 ఏళ్ల తర్వాత స్వస్థలం పెద్దపల్లిలో అడుగుపెట్టారు. ఇంటికి వచ్చిన ఆయనను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోన య్యారు. వేణుగోపాల్‌రావు గతఏడాది అక్టోబరు14న గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ ఎదుట లొంగిపోయారు. పెద్దన్న ఆంజనేయులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకున్న ఆయన మహారాష్ట్ర డీజీ పీ అనుమతి తీసుకుని భార్య సిడాం విమలచంద్ర అలియాస్‌ తారకతో కలిసి ఆదివారం ఉదయం పెద్దపల్లికి వచ్చారు. సోదరుడు, వదినను తప్ప వారి కుమారులు, కూతురు, ఇతర బంధువులను ఆయన గుర్తుపట్టలేకపోయారు. వేణుగోపాల్‌ను చూసిన అన్న అంజనేయులు సోదరుడిని ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సోదరుడి కుమారుడు, కుమార్తె, మనవలు, వదినతో ఆయన ముచ్చటించారు. మహారాష్ట్ర పోలీసులు ఆయనను తొందరపెట్టడంతో భోజనం చేయకుండానే మధ్యాహ్నం వెళ్లిపోయారు.

Updated Date - Mar 02 , 2026 | 01:32 AM