మావోయిస్టు అగ్రనేత సాంబయ్య లొంగుబాటు!
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:37 AM
మావోయిస్టు పార్టీ నుంచి కీలక నేతల నిష్క్రమణ కొనసాగుతోంది. తాజాగా పార్టీలో కీలక నేతగా ఉన్న ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్...
మరో 14మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట సరెండర్
వరంగల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ నుంచి కీలక నేతల నిష్క్రమణ కొనసాగుతోంది. తాజాగా పార్టీలో కీలక నేతగా ఉన్న ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ తన సహచర మావోయిస్టులతో కలిసి ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. శనివారం సాంబయ్య ఓ జర్నలిస్టు ఫోన్ ద్వారా.. ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మతో మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. హనుమకొండ జిల్లా కాజీపే ట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన సాంబయ్య 1986లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. సుమా రు 40ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన ఆయన, ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, ఏపీ సరిహద్దుల్లో పనిచేశారు. ఇటీవలే పార్టీ ఒడిసా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. సాంబయ్య లొంగుబాటుతో.. కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసూనూరి నరహరి అలియాస్ సంతోష్ ఒక్కరు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యుడిగా అజ్ఞాతంలో మిగిలారు.