మాతో టచ్‌లో బీఆర్‌ఎస్ నాయకులు
ABN , Publish Date - May 20 , 2026 | 03:31 AM
బీఆర్‌ఎస్‌కు చెందిన వందలాది మంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు వెల్లడించారు.
పార్టీలో చేరేందుకు సిద్ధం: రాంచందర్‌రావు
బీఆర్‌ఎస్‌కు చెందిన వందలాది మంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు వెల్లడించారు. అయితే వారిని నిలువరించేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణాలో బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘బీఆర్‌ఎస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది... రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగిన తాము ఇప్పుడు ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు... బండి సంజయ్ లక్ష్యంగా కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు చాలామందికి ఇష్టం లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.’ అని రాంచందర్‌రావు వివరించారు.