అది డ్రగ్ మాఫియా పార్టీ: మనోహర్‌రెడ్డి
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:18 AM
మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగింది కేవలం చిన్న పార్టీ కాదని, అది డ్రగ్ మాఫియా ఏర్పాటు చేసుకున్న పార్టీ అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగింది కేవలం చిన్న పార్టీ కాదని, అది డ్రగ్ మాఫియా ఏర్పాటు చేసుకున్న పార్టీ అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సహా దేశంలోని దుర్మార్గులంతా ఫాంహౌస్‌లో ఒక్కటై తెలంగాణ యువతపై డ్రగ్స్‌ను రుద్దే ప్రయత్నంలో ఈగల్ టీమ్‌కు దొరికిపోయారన్నారు. ఈ రాకెట్ వెనుక ఎవరు ఉన్నవారందరి పేర్లూ త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. సర్కారు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఈ రాకెట్‌ను కూకటివేళ్లతో పెకలించాలని కోరారు.