మన్ననూరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:58 AM
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన గురుకుల పాఠశాల (పీటీజీ)లో నీరు, ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు.
మన్ననూర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన గురుకుల పాఠశాల (పీటీజీ)లో నీరు, ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. గురువారం ఉదయం పాఠశాలలో కిచిడీ తిన్న తర్వాత 26 మంది విద్యార్థులు కడుపునొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. వారికి పీహెచ్‌సీ వైద్యాధికారి సుధాకర్ వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్ మహేష్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.