Share News

kumaram bheem asifabad- తూకాల్లో పక్కాదారి

ABN , Publish Date - Sep 27 , 2026 | 10:27 PM

మార్కెట్‌లో వినియోగదారుడు కొన్న ప్రతీ వస్తువు సరైన తూకంతో అందించాల్సి ఉంటుంది. కానీ తునికలు, కొలతల శాఖ నిబంధనలను కొందరు వ్యాపారులు పట్టించుకోక పోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్ట పోతున్నారు.

kumaram bheem asifabad- తూకాల్లో పక్కాదారి
లోగో

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యో తి): మార్కెట్‌లో వినియోగదారుడు కొన్న ప్రతీ వస్తువు సరైన తూకంతో అందించాల్సి ఉంటుంది. కానీ తునికలు, కొలతల శాఖ నిబంధనలను కొందరు వ్యాపారులు పట్టించుకోక పోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ప్రభుత్వం ధ్రువీకరించిన త్రాసులు, బరువులు మాత్రమే వినియోగించాల్సి ఉన్నా ఇంత వరకు ఎక్కడ కూడా పూర్తిగా అమలు కావటం లేదు. గడువు ముగిసినవి, ధ్రువీకరణ లేని డిజిటల్‌ వెయింగ్‌ యంత్రాలను యఽథేచ్ఛగా వాడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం మాన్యవల్‌ కాంటా, రాళ్లకు ప్రతి రెండేళ్లకొసారి, ఎలక్ట్రికల్‌ తూకాలకు ఏడాదికొసారి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు నిత్యావసరాలు కొనుగోలు చేసినప్పుడు ఏదో రకంగా మోసపోతూనే ఉన్నారు. కూరగా యలు, మటన్‌, చికెన్‌, కిరణా సరుకులు, పెట్రోల్‌ బంక్‌లు, ఫర్టిలైజర్‌ షాపులు, వస్త్రాల దుకాణాలు, తదితర వాటిల్లో నిత్యం ఎక్కడోచోట ప్రజలు జరిగే మోసాన్ని గ్రహిస్తున్నారు. వీటి నియంత్రణకు ప్రత్యేక యంత్రాంగం ఉన్నా నామ మాత్రపు తనిఖీలతోనే సరిపెడుతున్నారు.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో వ్యాపారంలో ఉపయోగించే త్రాసు, కాంటా, డిజిటల్‌ బెయింగ్‌ మిషన్‌, బరువును తూనికలు కొలతల(లీగల్‌ మెట్రా లజీ) శాఖ వద్ద ధ్రువీకరించాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి ముద్ర వేస్తారు. గడువు ముగిసిన తర్వాత మళ్లీ రీ వెరిఫి కేషన్‌ చేయించాలి. ఽధ్రువీకరణ లేని తూని కలను వాణిజ్య లావాదేవీల్లో ఉపయో గించడం చట్టవిరుద్దమని తెలిసినా కూడా ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ప్రతి వస్తువు నూ వినియోగదారులకు కన్పించేలా తూకం వేసి అందించాలి. కాని అన్ని చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేశారు. ఇందులో ముద్రల ద్వారా రూ.3,04,021 ము ద్రల ద్వారా, అపరాధ రుసుము రూ.99,000 కూడా వసూలు చేశారు. ఈ విషయమై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి అజీజ్‌ పాషాను వివరణ కోరగా తూకంలో తక్కువ రావడం ప్యాకింగ్‌ వస్తువులపై పూర్తి వివరాలు లేకున్నా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి వ్యాపారి కచ్చితంగా నిబంఽ దనలు పాటించాల్సిందన్నారు.. ఈ విష యంలో వ్యాపారులందరికీ అవగాహన కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

Updated Date - Sep 27 , 2026 | 10:27 PM