Share News

నష్టాల ఊబిలో మామిడి రైతులు

ABN , Publish Date - May 25 , 2026 | 10:57 PM

ఇతడి పేరు పుప్పిరెడ్డి లచ్చిరెడ్డి. నెన్నెల శివారులో మూడున్నర ఎకరాల మామిడి తోట ఉంది. వరుసగా గత ఐదేళ్లు పూత, కాత లేక దిగుబడి రావడం లేదు. దుక్కి, ఎరువులు, పురుగు మందులు, తోట కావలికి పెట్టిన ఖర్చులు కూడా చేతికి రాలేదు.

నష్టాల ఊబిలో మామిడి రైతులు

కాయలు అమ్మిన చోటే.. కట్టెలమ్ముతున్నారు...

-వరసగా ఐదేళ్లు కాత కాయని మామిడి తోటలు

-వయోభారంతో కాపుతగ్గిన ముదురు చెట్లు

-పెట్టుబడులు రాక చెట్లు నరికేస్తున్న రైతులు

-తోటలు పునరుద్దరించుకోవాలని నిఫుణుల సూచన

నెన్నెల, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఇతడి పేరు పుప్పిరెడ్డి లచ్చిరెడ్డి. నెన్నెల శివారులో మూడున్నర ఎకరాల మామిడి తోట ఉంది. వరుసగా గత ఐదేళ్లు పూత, కాత లేక దిగుబడి రావడం లేదు. దుక్కి, ఎరువులు, పురుగు మందులు, తోట కావలికి పెట్టిన ఖర్చులు కూడా చేతికి రాలేదు. తోటలో అంతర పంటగా పత్తి వేస్తే మామిడి చెట్ల నీడకు ఎదగడం లేదు. ఏళ్ల తరబడి కాయలు అమ్ముకొని ఉపాధి పొం దిన అతను... చేసేది లేక మామిడి చెట్లను నరికేసి క ర్రను అమ్ముకున్నాడు. మరో పంట వేసేందుకు ఆ భూ మిని సిద్ధం చేసుకుంటున్నాడు. ఒక లచ్చిరెడ్డి మాత్ర మే కాదు. తోటలు కాతకు రాకపోతుండటంతో చాలా మంది మామిడి రైతులు ప్రత్యామ్నయం గూర్చి ఆలోచిస్తున్నారు.

కాయలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్టు ఉంది ప్రస్తు తం జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి టన్నుల కొద్ది దిగుబడి సాధించి మార్కెట్‌కు తరలించిన రైతులు, ఇప్పుడు తోటల్లోని చెట్లను తొల గించి కాయల స్థానే కట్టెలమ్ముకుంటున్నారు. ఏళ్లతర బడి రైతులకు ఆర్థికంగా సామాజికంగా భరోసా ఇచ్చిన మామిడి తోటలు ఇప్పుడు భారంగా మారాయి. ము దురు తోటలు వరసగా ఐదేళ్లు కాపుకు రాకపోగ, లేత తోటలు కూడా అంతంత మాత్రపు దిగుబడులని స్తు న్నాయి. సాధారణంగా మామిడి చెట్లు ఓ సంవత్సరం ఎక్కువ కాస్తే మరుసటి యేడాది కొంత తక్కువ కా పునిస్తాయి. కాని పూర్తిగా కాయకపోవడం ఉండదు. అందుకు భిన్నంగా యేటికేడు దిగుబడులు గణనీయం గా తగ్గిపోవడం, కొన్ని తోటల్లో పూర్తిగా కాతకు రాక పోవడంతో రైతులకు ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనం కనిపించడం లేదు.

- 12 వేల ఎకరాల్లో ముదురు తోటలు

జిల్లాలో 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్త రించి ఉన్నాయి. వాటిలో 12 వేల ఎకరాల తోటలు 20 ఏళ్లకు పైబడి ఉన్నాయి. 20 ఏళ్ల లోపు చెట్లు అంతం త మాత్రంగా కాపు కాస్తుండగా... 20 ఏళ్ల వయసు పైబడిన చెట్లతో పెట్టుబడి కూడా చేతికి రావడం లేద ని రైతులు తెలిపారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక నష్టపోవాల్సి వస్తుందని పే ర్కొంటున్నారు. ఎకరానికి సాధారణ దిగుబడి 6 ట న్నులు రావాల్సి ఉండగా.. ముదురు తోటల్లో టన్ను కంటే ఎక్కువ రావడం లేదు. ఎకరానికి రూ. 50 వేల నుంచి లక్ష వరకు ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు అప్పులపాలవుతున్నారు.

-వెయ్యి రూపాయలకు ఒక చెట్టు

మామిడి చెట్లను తొలగిస్తున్న విషయం తెలుసుకు న్న ఆంధ్ర ప్రాంత వ్యాపారులు వచ్చి చెట్లు కొనుగోలు చేస్తున్నారు. వెయ్యి రూపాయలకు ఒక చెట్టు చొప్పున కొనుగోలు చేసి మిషన్‌ రంపాలతో ముక్కలు చేసి కుప్పలు వేస్తున్నారు. సైజును బట్టి వేరు చేసి కార్డ్‌బోర్డ్‌ కంపెనీలకు, పట్టణాల్లోని హోటల్లకు మామిడి కర్రను తరలిస్తున్నారు. ప్రతీ రోజు పదుల సంఖ్యలో లారీల్లో మామిడి కర్ర తరలిపోతోంది.

-పునరుద్ధరించుకుంటే మేలు.....

ముదురు తోటలను టాప్‌వర్కింగ్‌తో పునరుద్ధరించే అవకాశం ఉందని ఉద్యాన శాఖ నిపుణులు చెబుతు న్నారు. పెద్ద చెట్ల కొమ్మలు కత్తిరించి కొత్తగా అంట్లుక ట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ముదురు తోటల్లోని చెట్లను పునరుద్ధరించి రెండు, మూడేళ్లలో సుస్థిర దిగుబడులు తేవడానికి టాప్‌వ ర్కింగ్‌ వరం లాంటింది. ఈ ఆధునిక పద్ధతిపై రైతుల కు అవగాహన లేక పోవడంతో అన్నివిధాల నష్ట పోతున్నారు.

-టాప్‌ వర్కింగ్‌ అంటే...

ముదురు చెట్లు లేదా డిమాండ్‌ లేని రకాలను కొత్త గా మరో రకం అంటు కట్టి అనువైన రకాలు పండించ డాన్ని టాప్‌ వర్కింగ్‌ అంటారు. ముదురు చెట్ల పెద్ద కొమ్మలన్నింటిని రంపంతో కత్తిరిస్తారు. వాటికి లేత కొ మ్మలు చిగురించే వరకు వేచిచూస్తారు. అంటు కట్టా లనుకునే రకం చెట్టు నుంచి 3, 4 అంగుళాల పొడవు గల లేత రెమ్మలను ముందుగానే సేకరించి ఉంచుకుం టారు. ఒక్కో చెట్టుకు 50 నుంచి 200 వరకు కొత్త అంట్లను కడతారు. అంటు కట్టిన చోట ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి వర్షపు నీరు లోనికి పోకుండా జాగ్రత్త పడతారు. నీరు అంటు లోనికి వెలితే శిలింద్రాలు ఆశించే అవకా శం ఉంటుంది. కొమ్మలు అంటు కట్టిన చోట చీడ పీడ లు ఆశించ కుండా బోర్డు మిశ్రమాన్ని పూస్తారు. అం టు కట్టిన దాని కంటే కింది భాగంలో కొమ్మలు పెరగ కుండా జాగ్రత్త పడతారు. సకాలంలో నీరు, పోషకాలు అందిస్తే అంటు కట్టిన కొమ్మలు చిగురించి వచ్చే సీజన్‌కల్లా పూత పూసి కాతకొస్తాయి.

తోటలు తొలగించడం పరిష్కారం కాదు

అరుణ్‌కుమార్‌, ఉఽధ్యాన అధికారి

దిగుబడులు రావడం లేదని మామిడి తోటలను పూ ర్తిగా తొలగించడం పరిష్కారం కాదు. దశాబ్దాల తరబ డి రైతులకు సామాజిక, ఆర్థిక భద్రతనిచ్చిన మామిడి తోటలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. టాప్‌వర్కింగ్‌తో తోటల పునరుద్దరించు కుంటే మంచి ఫలితం ఉంటుంది. కొమ్మలు కత్తిరించుకొని కొత్త అం ట్లు కట్టుకోవడంతో జవసత్వాలు కోల్పోయన చెట్లు రెం డేళ్లలో సుస్థిర దిగుబడులను ఇస్తాయి. ఈ పద్ధతి ద్వా రా కొందరు రైతులు సత్ఫలితాలను పొందారు. ముదు రు తోటల పునరుద్దరణకు హెక్టారుకు రూ. 20 వేల వరకు ప్రభుత్వం సాయం చేస్తుంది. గ్రామాల్లో సదస్సు లు ఏర్పాటు చేసి టాప్‌వర్కింగ్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - May 25 , 2026 | 10:57 PM