ఆర్‌సీపురంలో మాంగళ్య షాపింగ్ మాల్
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:49 AM
2012లో తెలంగాణలోని వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్ వస్త్ర వ్యాపారరంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది.
ఘనంగా 31వ శాఖ ప్రారంభం
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): 2012లో తెలంగాణలోని వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్ వస్త్ర వ్యాపారరంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య.. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది. ఈ క్రమంలో హైదరాబాద్ శివారు ఆర్‌సీపురంలో తన 31వ శాఖను ఘనంగా ప్రారంభించింది. సీనినటి రాశీఖన్నా ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ.. ఆర్‌సీపురం ప్రజల ఆదరణతో మాంగళ్య షాపింగ్ మాల్ విజయవంతగా నడుస్తుందని అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన, నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో ఉంచడమే తమ మాల్ విజయ రహస్యమని తెలిపారు. తమ సొంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నామని పేర్కొన్నారు.