kumaram bheem asifabad- సాదాసీదాగా మండల సర్వ సభ్య సమావేశం
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:08 PM
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశం సాదాసీదాగా సాగింది. ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశానికి మండలంలోని గ్రామ పంచాయితీ సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరై గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించాలి ఉంది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సామర్థ్య పెంపుతోపాటు గ్రామ పంచాయితీల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించాల్సి ఉంటుంది.
సిర్పూర్(యు), నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశం సాదాసీదాగా సాగింది. ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశానికి మండలంలోని గ్రామ పంచాయితీ సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరై గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించాలి ఉంది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సామర్థ్య పెంపుతోపాటు గ్రామ పంచాయితీల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలసిరి పథకం, వీబీ-జీ రామ్‌జీ పథకం, వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, అటవీ శాఖ, విద్య, వైద్య,ఆర్,డబ్ల్యూ,ఎస్, పంచాయితీ రాజ్ తదితర ఆంశాలపై చర్చించి, సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కాగా ప్రజలకు, గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సమగ్ర చర్చ జరగకపోవడంతో సమావేశం నామమాత్రంగా ముగిసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి .ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే సమావేశాలు కేవలం మొక్కుబడి కార్యక్రమాలుగా కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మారాలని పలువురు అభిప్రాయప డుతున్నారు. గత సమావేశంలో లెవనేత్తిన సమస్యల పరిష్కారంపై చర్చ జరగలేదు. గత సమావేశాల తీర్మానాలపై అధికారుల జవాబుదారీలేదని సర్పంచులు అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. సమావేశంలో ఎంపీడీవో రవిందర్ అధ్యక్షతన జరగగా తహసీల్దార్ జమీర్‌ఖాన్, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.