దాడి కేసులో మంచు విష్ణుకు నోటీసులు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:58 AM
స్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్‌లపై మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రతినిధులు, బౌన్సర్లు దాడి చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ బృందం మంచు విష్ణుకు నోటీసులు అందజేసింది.
తిరుచానూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్‌లపై మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రతినిధులు, బౌన్సర్లు దాడి చేసిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ బృందం మంచు విష్ణుకు నోటీసులు అందజేసింది. అయితే ఈ నెల 15 వరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని, ఆ తర్వాత విచారణకు వస్తానని విష్ణు చెప్పినట్టు సీఐ తెలిపారు. మరోమారు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరు కావాలని విష్ణును కోరతామన్నారు. కాగా, హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసానికి పోలీసులు నోటీసులు తీసుకెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో చంద్రగిరి మండలం రంగంపేటలోని ఎంబీయూకు వెళ్లారు. అక్కడ కూడా లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. మోహన్‌బాబు ఎక్కడ ఉన్నా నోటీసులు అందజేస్తామని సీఐ చెప్పారు.