Share News

kumaram bheem asifabad- నిర్వహణ గాలికి.. ప్రజలకు అవస్థలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:01 PM

టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతను పట్టించు కోక పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్లు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్నాయి. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యత అప్పగిసు ్తన్నాయి. నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా రోడ్డు నిర్వమణ బాధ్యతలు చూసుకోవాల్సిన కాంట్రా క్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది.

kumaram bheem asifabad- నిర్వహణ గాలికి.. ప్రజలకు అవస్థలు
నంబాల వాగుపై ప్రమాదకరంగా ఉన్న లోలెవల్‌ వంతెన

- ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి, కల్వర్టు

- పట్టించుకోని అధికారులు

రెబ్బెన, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతను పట్టించు కోక పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్లు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్నాయి. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యత అప్పగిసు ్తన్నాయి. నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా రోడ్డు నిర్వమణ బాధ్యతలు చూసుకోవాల్సిన కాంట్రా క్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. రెబ్బెన మం డల కేంద్రం నుంచి భీమిని వయా నారాయణపూర్‌, కిష్టాపూర్‌, జక్కులపల్లి మీదుగా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద బీటగీ రోడ్లు మంజూరు చేసింది. గతంలో ఉన్న రడ్లోను విస్తరించడంతో పాటు రోడ్డు వెంట అవసరం ఉన్న చోట్ల కొత్త కల్వర్టుల నిర్మాణం కోసం రూ.514.64 లక్షల నిధులు మంజూరు చేసింది. 8.50 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను పంచాయతీ రాజ్‌ అధికారులు టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 2021 ఆగస్టులో పనులు ప్రారంభం కాగా 2023 ఏప్రిల్‌లో పూర్తి చేశారు. నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్‌కే అయిదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలను సైతం అప్ప గించారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహణ పను లు చేపట్టాల్సిన కాంట్రాక్టర్‌ నిబంధనలను తుంగలో తొక్కి నిర్వహణ పనులను గాలికి వదిలేశాడు. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుపైకి వస్తున్నాయి. ముళ్ల పొదలు రోడ్ల పైకి వస్తుండడంతో వాహనదారులు ఇబ్బం దులకు గురవుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకటి రెండు దఫాల్లో మాత్రమే పనులు చేపట్టినట్లు సమాచారం. రోడ్డు వేసిన కొన్ని నెలలకే బీటీ చెదిరి పోయి గుంతలు ఏర్పడ్డాయి. కల్వర్టుల వద్ద రోడ్డు కుంగి పోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

- చిలుకమర్రిగూడ వరకు..

రెబ్బెన మండల కేంద్రం నుంచి చిలుకమర్రిగూడ వరకు నిర్మించిన బీటీ రోడ్డుపై దారి మధ్యలో ఉన్న బ్రిడ్జి, కల్వర్ట్లులు ప్రమాదకరంగా మారాయి. నంబాల వాఉగపై ఉన్న లో లెవల్‌ వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేక పోవడంతో వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనం బ్రిడ్జిపై నుంచి వాగులో పడి పోయే ప్రమాదం ఉంది. ఇటీవల రెబ్బెన పోలీసు స్టేషన్‌కు చెందిన ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ద్విచక్ర వాహనం నంబాల బ్రిడ్జిపై అదుపు తప్పింది. దీంతో వాహనంతో పాటు ఆ వ్యక్తి వాగులో పడి పోయాడు. ఈ మార్గం గుండా నంబా ల, నారాయణపూర్‌, రాజారాం, కిష్టాపూర్‌, జక్కులప ల్లి, ధర్మా రం, కొమురవెల్లి గ్రామ పంచాయతీల ప్రజ లను నిత్యం పనుల మీదుగా మండల కేంద్రా నికి రాక పోకలు సాగిస్తుంటారు. బ్రిడ్జి, కల్వర్టుపై ప్రమా దకర పరిస్థితుల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నా రు.

చర్యలు తీసుకుంటాం..

- రాజన్న డీఈఈ, పంచాయతీ రాజ్‌

రోడ్డు వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం తో పాటు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేయి స్తాం. రెబ్బెన నుంచి భీమిని వయా నారాయణపూర్‌, కిష్టాపూర్‌, జక్కుల పల్లి రోడ్లు నిర్వహణ పనులను కాంట్రాక్టర్‌ తప్పని సరిగా ప్రతి మూడు నెలలకు ఒక సారి విధిగా పనులు చేయాలి. ఈ నెలలో పనులు చేపట్టాల్సి ఉంది. ఒక వేళ పనులు చేపట్టని పక్షంలో కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టేలా నిబంధనలు ఉన్నాయి.

Updated Date - Feb 26 , 2026 | 11:01 PM