Share News

kumaram bheem asifabad- నిర్వహణ భారం

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:05 PM

అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికా రులకు తలకు మించిన భారంగా మారింది. రైతులకు సాగు మెళకువలు, అధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తల ద్వారా సలహలు, సూచనలు అందించా లనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. కాగా నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

kumaram bheem asifabad- నిర్వహణ భారం
లోగో

- విద్యుత్‌ బిల్లులు, తాగునీరు, స్టేషనరీ ఖర్చులకు ఏఈవోల అవస్థలు

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికా రులకు తలకు మించిన భారంగా మారింది. రైతులకు సాగు మెళకువలు, అధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తల ద్వారా సలహలు, సూచనలు అందించా లనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. కాగా నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా విద్యుత్‌ బిల్లులు, తాగునీరు, స్టేషనరీ, చిన్నచిన్న మరమ్మ తులకు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 రైతువేదికలు ఉండగా ఇందు లో వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్లు గలవి 44 ఉన్నా యి. వీటిలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతునేస్తం కార్యక్ర మాన్ని నిర్వహిస్తోంది.

- క్లస్టర్‌కు ఒకటి చొప్పున..

అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో వ్యవ సాయ క్లస్టర్‌కు ఒక రైతువేదిక చొప్పున నిర్మించింది. ఒక్కో నిర్మాణానికి రూ. 22 లక్షలు వెచ్చించగా అందులో వ్యవసాయశాఖ రూ. 12 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షలు ఉన్నాయి. మొదట్లో నిర్వహణకు రూ. 3 వేల చొప్పున మంజూరు చేయగా ఆ నిధులు సరిపోవడంలేదని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరండం తో రూ. 9వేలకు పెంచారు. ఇందులో పారిశుద్ద్యం క్సోం రూ. 3వేలు, విద్యుత్‌ బిల్లు రూ. వేయి, స్టేషనరీ కొనుగోలుకు రూ. వేయి, తాగునీటికి రూ. వేయి, రైతుల శిక్షణ సమయంలో టీ, అల్పామరం తదితర ఖర్చులకు రూ. 2,500 కేటాయించారు. ఈ నిధులు 2022 నుంచి మూడు నెలలు మాత్ర మే వచ్చాయని అనంతరం నిలిచిపోయాయని వ్యవసాయశాఖ అదికారులు చెబు తున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేయడం లేదని తెలిపారు. రైతువేదికల నిర్వహణ తమకు భారంగా మారిందని వాపోతున్నారు.

- కనీస సౌకర్యాలు కరువు

రైతువేదికల్లో కనీస వసతులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. కాలకృ త్యాలు తీర్చు కోవడానికి మూత్రశాలలు సైతం సరిగా లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళా ఏఈవోలు వాపోతున్నారు. పంట వివరాలు ఆన్‌లైన్‌ లో నమోదు చేసేందుకు కంప్యూటర్లు అందుభాటు లో ఉన్నప్పటికీ విద్యుత్‌ బిల్లులు, పరికరాల మరమ్మ తులకు అవసరమైన నిధులు మంజూరు కావడం లేదు. తాగునీరు, స్టేషనరీ తదితర అవసరాలకు కూ డా అధికారులు సొంత డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి రైతువేదికల నిర్వహ ణకు సిబ్బందిని నియమించడంతో పాటు నిర్వహణ కు నిధులు మంజూరు చేయాలని ఏఈవోలు కోరుతున్నారు.

నిధులు రావాల్సి ఉంది..

- వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆసిఫాబాద్‌

రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 70 రైతు వేదికలు ఉన్నాయి. ఒక్కో రైతువేదిక నిర్వహణకు సుమారుగా రూ. 9వేల వరకు ఖర్చవుతోంది.. 2022 నుంచి నిధులు విడుదల కాలేదు. ఇప్పటికే సమస్య ను ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

Updated Date - Nov 04 , 2026 | 10:05 PM