Share News

తెలంగాణ రైతులను కేంద్రం ఆదుకోవాలి: మల్లు రవి

ABN , Publish Date - Jul 21 , 2026 | 04:21 AM

తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ పంటలకు తీవ్ర సంక్షోభం ఏర్పడిందని, కేంద్రం స్పందించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి కోరారు.

తెలంగాణ రైతులను కేంద్రం ఆదుకోవాలి: మల్లు రవి

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ పంటలకు తీవ్ర సంక్షోభం ఏర్పడిందని, కేంద్రం స్పందించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి కోరారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 33 జిల్లాలకు గానూ 27 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌ ‘జీరో అవర్‌’ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నోటీసు ఇచ్చినప్పటికీ, సభ పదే పదే వాయిదా పడటంతో మాట్లాడలేకపోయానన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 04:22 AM