Share News

సీతక్క.. గొప్ప ఫైటర్‌!

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:53 AM

తెలంగాణ మంత్రి సీతక్క గొప్ప ఫైటర్‌ అని, ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించే తత్వం ఆమెదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు.

సీతక్క.. గొప్ప ఫైటర్‌!

  • ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తారు.. ఖర్గే ప్రశంసలు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి సీతక్క గొప్ప ఫైటర్‌ అని, ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించే తత్వం ఆమెదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపిస్తారని, అడవుల్లో తిరుగుతూ ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకుని సేవలు అందిస్తున్న గొప్ప నాయకురాలని కొనియాడారు. కేరళం రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ జిల్లాలో ఆదివారం కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ సీతక్కపై ప్రశంసలు కురిపించారు. ‘ఆదివాసీ బిడ్డ సీతక్క తన కృషి, పట్టుదలతో ఎదిగిన గొప్పనాయకురాలు.. ప్రజలతో నేరుగా మమేకమై వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని సేవ చేయడం ఆమె ప్రత్యేకత’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 06 , 2026 | 04:53 AM