అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట: భట్టి
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:13 AM
మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకు పెద్దపీట వేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకు పెద్దపీట వేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో 83 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నదని పేర్కొన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీలవారు తమతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, చివరకు 116 మునిసిపాలిటీలకుగాను 90 నుంచి 94 మునిసిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతాయని స్పష్టం చేశారు.