Share News

kumaram bheem asifabad- మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ABN , Publish Date - Aug 20 , 2026 | 10:51 PM

మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ సమాజం ఐక్యతతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు మాలీ కులస్తులను ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు

kumaram bheem asifabad- మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
మాట్లాడుతున్న మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు

వాంకిడి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మాలీ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలీ సమాజం ఐక్యతతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు మాలీ కులస్తులను ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం ఈ అంశంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రస్తవించడంలేదని ఆయన విమర్శించారు. ఎంపీ గోడాం నగేష్‌, ఎమ్మెల్యే హరీష్‌బాబు సహా బీజేపీ ప్రజాప్రతినిధులు రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో మాలీల ఎస్టీ హోదా అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో మాలీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మాలీల సమాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సీఎం రెవంత్‌ రెడ్డీ, మంత్రులు ఎస్టీ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి వసంత్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్నులే నారాయణ, జిల్లా అధ్యక్షుడు వాసు, మండల నాయకులు గౌరయ్య, గోపాల్‌, బాబురావు, జ్యోతిబా, దివాకర్‌, బాబురావు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 10:51 PM