Share News

ఓటు వేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల..

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:53 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ యువకుడు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు అతడి ఇంటిని గుల్ల చేశారు.

ఓటు వేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల..

మక్తల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ యువకుడు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు అతడి ఇంటిని గుల్ల చేశారు. రూ.2లక్షల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు కాజేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మక్తల్‌ పట్టణంలోని శబరి కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విజయభాస్కర్‌రెడ్డి అనే యువకుడు స్థానిక బజాజ్‌ షోరూంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగపరంగా వసూలు అయిన నగదుతోపాటు బంగారు ఆభరణాలను బీరువాలో పెట్టి తాళం వేసి ఉదయం 11 గంటలప్పుడు ఓటేసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం, బీరువా తాళం విరగొట్టిన దొంగలు బీరువాలోని నగదు, ఆభరణాలను ఎత్తుకుపోయారు.

Updated Date - Feb 12 , 2026 | 02:53 AM