Share News

kumaram bheem asifabad- బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 24 , 2026 | 10:37 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 1న జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగసభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. స్థానిక నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పథకం ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలను అధిక సంఖ్యలో తీసుకు వచ్చి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

kumaram bheem asifabad- బహిరంగ సభను విజయవంతం చేయాలి
బెజ్జూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

బెజ్జూరు, మే 24 (ఆంధ్రజ్యోతి) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 1న జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగసభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. స్థానిక నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పథకం ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలను అధిక సంఖ్యలో తీసుకు వచ్చి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీవర్ధర్‌, జగ్గాగౌడ్‌, నహీర్‌ అలీ, సర్పంచ్‌ చిన్నయ్య, రాంప్రసాద్‌, ఉప సర్పంచ్‌ అదర్శ్‌, శంకర్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 1న జిల్లాలో పర్యటన నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సభనేఉ విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. ఆదివారం దహెగాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భీమన్న, తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డిన పర్యటన నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. ఆదివారం స్థానిక నాయకులతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పథకం ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలను అధిక సంఖ్యలో తీసుకు వచ్చి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 10:37 PM