భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:27 PM
అర్హులైన వారందరు ఇం దిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మద్దికల్ గ్రామపం చాయతీ కార్యాలయంలో జరుగుతున్న పథకం దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన వారందరు ఇం దిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మద్దికల్ గ్రామపం చాయతీ కార్యాలయంలో జరుగుతున్న పథకం దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తె లుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 66 దరఖాస్తులు వచ్చా యని తెలిపారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులను పూర్తి వివరా లతో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. నామిని ఎంపిక విషయంలో సంబంధిత లబ్దిదారుల నుంచి భౌతికంగా సంతకాలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీ కార్యదర్శి, అదికారులు ఉన్నారు.
భీమారం : అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం వర్తిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మద్దికల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఎంపీడీవో వీణ, ఎంపీవో సతీస్‌రెడ్డి, గ్రామ సర్పంచు పోతం సమ్మయ్యతో కలిసి భీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
జైపూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇం దిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చర్యలు తీ సుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో జరిగిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు. జైపూర్ గ్రా మంలో ఇప్పటి వరకు 28 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మాణంలో ఎస్సీ వసతి గృహ భవన నిర్మాణ పను లను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
దండేపల్లి: ఇందిరమ్మ బీమా పథకాన్ని శుక్రవారం మాకులపేట గ్రామ పంచాయతీ కార్యలయంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి, మండల ప్రత్యేకా ధికారి చాతరాజు దుర్గప్రసాద్, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, నెల్కి వెంకటా పూర్ సహకార సంఘం ఛైర్మన్ ము త్యాల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బోర్లకుంటి శంకరయ్య, ఉపసర్పం చ్ అత్తే సాగర్, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఎంపీవో విజయ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, కార్యదర్శు పాల్గొన్నారు.
జన్నారం: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని చింతపల్లి గ్రామ పంచా యతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని సంద ర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్‌షరీఫ్, సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.