సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:44 PM
ఫోన్ పోయి నా...దొంగిలించబడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఈఐర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకొని వారి సెల్‌ఫోన్‌లను పొందాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు.
142 సెల్ఫోన్లు బాధితులకు అప్పగింత
వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): ఫోన్ పోయి నా...దొంగిలించబడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఈఐర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకొని వారి సెల్‌ఫోన్‌లను పొందాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న, లేదా దొంగలించబడిన బాధితు లకు సెల్‌ఫోన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ ఆ చూకీ గుర్తించేందుకు సీపీఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో పదివేల 420 మంది సీఈఐర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా అందులో 3717 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకొని యజమానులకు అందజేశా మన్నారు. సీసీఎస్, ఐటీసెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమిం చి మరో 142 సెల్‌ఫోన్‌లు గుర్తించి స్వాధీనం చేసుకు న్నామన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబా టులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక సాధనంగా మారిందన్నారు. ఎవరైన తన ఫోన్‌ను పోగొట్టుకున్నా, దొంగలించబడిననా వెంటనే పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు పో లీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. పోర్టల్‌లో వివ రాల నమోదు ఆధారంగా మొబైల్‌ఫోన్‌ను ఇతర రాష్ర్టాల్లో లేదా ఇతర నెట్‌వర్కుల్లో వినియోగించకుండా నిషేధిం చవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, క్రిష్ణారెడ్డి, టి. గోపి, బాలాజి, వర ప్రసాద్, సీఐలు పాల్గొన్నారు.