Majlis Party president Asaduddin Owaisi: మునిసిపోల్స్‌కు రెడీ: అసదుద్దీన్
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:18 AM
రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తమ పార్టీ సిద్ధమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తమ పార్టీ సిద్ధమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పోటీ చేయడానికి ఆసక్తి గల నేతలు ఈనెల 20లోగా సంబంధిత జిల్లా బాధ్యులకు దరఖాస్తులివ్వాలని చెప్పారు. దారుల్‌సలాం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయా దరఖాస్తులను పరిశీలన కోసం వెంటనే హైదరాబాద్‌కు పంపాలని చెప్పారు. బీజేపీతో గానీ, ఎన్‌డీఏతో గానీ మజ్లిస్ పొత్తు పెట్టుకోలేదన్నారు. తాము ఏ పార్టీకి బీ టీం కాదని, అకోట్ ప్రాంతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు వచ్చిన వార్తలతో అక్కడి స్థాని క నేతలను సస్పెండ్ చేశామన్నారు. తమ పార్టీలో కార్పొరేటర్ స్థాయినేతలు విధాన నిర్ణయం తీసుకోరని తెలిపారు.