రేవంత్ దిగిపోవాలనడానికి జీవన్‌రెడ్డి ఎవరు?
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:16 AM
సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని చెప్పడానికి జీవన్‌రెడ్డి ఎవరని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలంతా....
ఎమ్మెల్యేలు ఎన్నుకున్న సీఎం ఆయన: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని చెప్పడానికి జీవన్‌రెడ్డి ఎవరని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలంతా కలిసి రేవంత్‌రెడ్డిని సీఎంగా ఎన్నుకున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు జీవన్‌రెడ్డి విమర్శలను పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు జీవన్‌రెడ్డికి 14 సార్లు బీ ఫారమ్ ఇచ్చిందని గుర్తు చేశారు. గాంధీభవన్‌లో గురువారం మహేష్ గౌడ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు.. గతంలో బీఆర్‌ఎస్‌పై చేసిన విమర్శలకు జీవన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మంత్రి పొంగులేటిపై హరీశ్‌రావు ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలు చూపిస్తే గాంధీభవన్ వేదికగా చర్చిస్తామన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదన్నారు.