ఆయన కమలంలో ఓ రెక్క!
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:29 AM
కమలం పువ్వుకు చాలా రెక్కలు ఉంటాయని, వాటిలో ఒక రెక్క పవన్ కళ్యాణ్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్, కమలం కలిసొచ్చినా ఉపయోగం లేదు
కాంగ్రెస్ పార్టీకి బాధా లేదు
మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : కమలం పువ్వుకు చాలా రెక్కలు ఉంటాయని, వాటిలో ఒక రెక్క పవన్ కళ్యాణ్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. కమలం పార్టీ, పవన్ కళ్యాణ్‌లు కలిసి వచ్చినా కాంగ్రెస్‌పార్టీకి బాధ లేదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలుసంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ పోతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏదో సాధిద్దామని ఇక్కడికి వస్తే నిరాశపడక తప్పదన్నారు. కేటీఆర్, పవన్ కళ్యాణ్ సహా ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహే్‌షగౌడ్ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా ఇప్పటికీ మతం పేరిటే ఓట్లు అడుగుతోందన్నారు. ‘‘దేశంలో నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పరీక్షల కోసం చేసిన ఖర్చు రూ. 1.32 లక్షల కోట్లు... ఇది కేంద్రం విద్యకు కేటాయించిన బడ్జెట్‌తో సమానం. పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల విద్యార్థులకు ఇంత నష్టం జరిగింది. ఈ పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థుల కష్టం ప్రధాని మోదీకి పట్టడం లేదు.’’ అని ధ్వజమెత్తారు. యూనివర్శిటీల్లోకి ఆర్‌ఎ్‌సఎస్ భావజాలం కలిగిన వ్యక్తులను దూర్చడం వల్ల కుల, మత వైషమ్యాలతో విద్యా వ్యవస్థ కలుషితమై గతి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.