Share News

రాష్ట్ర నాశనం కోసం హరీశ్‌ క్షుద్రపూజలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:38 AM

ఎవరైనా రాష్ట్రం బాగు కోసం దేవుళ్లకు పూజ చేస్తారని, కానీ బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మాత్రం రాష్ట్రం నాశనం కోరుతూ క్షుద్ర పూజలు చేయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్య లు చేశారు.

రాష్ట్ర నాశనం కోసం హరీశ్‌ క్షుద్రపూజలు

  • మార్చి2న తిరుచ్చి, జూన్‌ 1న శివమొగ్గ వెళ్లొచ్చాడు

  • ఆ తేదీల్లో ఎక్కడున్నారో హరీశ్‌రావు చెప్పాలి

  • అప్పుడు ఆధారాలు బయట పెడతాం

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఎవరైనా రాష్ట్రం బాగు కోసం దేవుళ్లకు పూజ చేస్తారని, కానీ బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మాత్రం రాష్ట్రం నాశనం కోరుతూ క్షుద్ర పూజలు చేయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్య లు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ.. హరీశ్‌రావు మార్చి 2న తిరుచ్చి, జూన్‌ 1న శివమెగ్గలో క్షుద్రపూజలు చేశారని, అందుకు ఆధారాలు ఉన్నట్టు చెప్పారు. వరుస ఎన్నికల్లో ఓటమితో ప్రజ లు తమవైపు లేరని అర్థం చేసుకున్న హరీశ్‌రావు.. ఇలాంటి పూజలు చేస్తే లాభం కలుగుతుందని అనుకుని ఉంటాడన్నారు. ఎప్పుడు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే హరీశ్‌.. ఆ ఆలయాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఎందుకు పంచుకోలేదని సందేహం వ్యక్తం చేశారు. ఆ తేదీల్లో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు తాము ఆధారాలు బయటపెడతామని చెప్పారు. హరీ శ్‌రావు తన తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వాస్తవాలు బయటపడడంతోనే భయపడి, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌, మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు పంపారన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌, ఆ పార్టీ నాయకులు అఘోరాలతో తాంత్రిక, క్షుద్ర పూజలు చేయిస్తున్నారన్న ప్రచారం ఉందని.. హరీశ్‌రావు క్షుద్ర పూజలు చూశాక అది నిజమేనన్న అనుమా నం కలుగుతోందని పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో హరీశ్‌ అగ్గిపెట్టె నాటకంవల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 04:40 AM