Share News

పండి పొర్లినా ప్రజలు క్షమించరు

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:46 AM

కేటీఆర్‌ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు. ఆయన పాదయాత్ర కాదు.. పండి పొర్లినా రాష్ట్ర ప్రజలు క్షమించరు. ముందు మీ చెల్లెలి ప్రశ్నలకు సమాధానం చెప్పి ...

పండి పొర్లినా ప్రజలు క్షమించరు

  • పాదయాత్ర చేసిన ఎవరు పట్టించుకోరు

  • కేటీఆర్‌.. ముందు మీ చెల్లెలి ప్రశ్నలకు సమాధానం చెప్పు

  • పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌

  • అభివృద్ధి పథకాలను ప్రచారం చేయండి

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి

ఖమ్మం, ఏప్రిల్‌ 14 (ఆంరఽధజ్యోతి ప్రతినిధి): ‘కేటీఆర్‌ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు. ఆయన పాదయాత్ర కాదు.. పండి పొర్లినా రాష్ట్ర ప్రజలు క్షమించరు. ముందు మీ చెల్లెలి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత పాదయాత్ర చేయి’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ సవాల్‌ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 100 ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మహే్‌షకుమార్‌తోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్‌ నాయక్‌, మట్టా రాగమయి తదితరులు హాజరయ్యారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా తొలుత వారు ఖమ్మం జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కమిటీ సభ్యులతో మహే్‌షకుమార్‌ ప్రమాణం చేయించారు. అనంతరం మహే్‌షకుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని దోచుకొని రూ.వేల కోట్లు సంపాదించారని కేటీఆర్‌ చెల్లెలే బహిరంగంగా చెబుతున్నారని చెప్పారు. నాడు దోచుకొని మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీయే గెలుస్తుందని స్పష్టంచేశారు. తాము పనిచేసి ప్రజలను ఓట్లడుగుతాం తప్ప.. దేవుళ్ల పేరుతో ఓట్లు అడగబోమని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రైతులకు మేలు జరగకూడదని బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో పదేళ్లు దొరల ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకొని అవినీతి పాలన సాగించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గత పాలకులు గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేసుకున్నారని, మనం కొండంత అభివృద్ధి చేస్తున్నా గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని అన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 04:46 AM