డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రెడీ.. కేసీఆర్ సిద్ధమా?
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:09 AM
డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం.. ఆయనను నేను తీసుకువస్తాను.. టెస్టుకు కేసీఆర్ సిద్ధమా..? ఆయనను బీఆర్‌ఎస్ నేతలు టెస్ట్‌కు తీసుకురాగలరా..
శాసనమండలిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
‘డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం.. ఆయనను నేను తీసుకువస్తాను.. టెస్టుకు కేసీఆర్ సిద్ధమా..? ఆయనను బీఆర్‌ఎస్ నేతలు టెస్ట్‌కు తీసుకురాగలరా..?’ అని టీపీసీసీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు మహేష్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులమంతా డ్రగ్స్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ కూడా డ్రగ్స్ పరీక్షకు రావాలి. మొదట వారిద్దరికి డ్రగ్స్ పరీక్ష చేద్దాం. తర్వాత ప్రజా ప్రతినిధులందరూ పరీక్షలు చేయించుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము బీ-ఫాం ఇచ్చిన ప్రతి అభ్యర్థిని డ్రగ్స్ టెస్ట్‌కు తీసుకొస్తాం. మీరు కూడా బీ-ఫారం ఇచ్చిన వారందరిని తీసుకురాగలరా? అని బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. డ్రగ్స్ రాకెట్‌లో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.