Share News

బెంగాల్‌ తరహా కుట్ర జరగకుండా చూడాలి

ABN , Publish Date - May 30 , 2026 | 03:43 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌)లో భాగంగా పశ్చిమబెంగాల్‌ తరహా కుట్రలు తెలంగాణలోనూ జరగకుండా చూడాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ....

బెంగాల్‌ తరహా కుట్ర జరగకుండా చూడాలి

  • మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌)లో భాగంగా పశ్చిమబెంగాల్‌ తరహా కుట్రలు తెలంగాణలోనూ జరగకుండా చూడాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘సర్‌’లో భాగంగా బెంగాల్‌లో 60 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించడంతో అక్కడ ప్రభుత్వమే మారిపోయిందని గుర్తుచేశారు. ‘సర్‌’పై శుక్రవారం గాంధీభవన్‌లో ఎంపికచేసిన మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేశామని, 90కి పైగా నియోజకవర్గాల్లో బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) నియామకమూ పూర్తయిందని చెప్పారు. జిల్లా, మండల కమిటీలనూ దాదాపుగా పూర్తిచేసినట్లు వెల్లడించారు. శిక్షణ అనంతరం మాస్టర్‌ ట్రైనీలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోని బీఎల్‌ఏలకు శిక్షణను ఇవ్వనున్నారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఆలంఖాన్‌పై సస్పెన్షన్‌ వేటు..

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడైన ఆలంఖాన్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ చైర్మన్‌ మల్లు రవి ప్రకటించారు. మొయినుద్దీన్‌ హత్యకేసులో ఆలంఖాన్‌ను, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Updated Date - May 30 , 2026 | 03:43 AM