Share News

TPCC president Mahesh Goud: కేటీఆర్‌కు సిస్టర్‌ స్ట్రోక్‌.. హరీశ్‌కు మరదలి స్ట్రోక్‌

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:32 AM

కేటీఆర్‌కు సిస్టర్‌ స్ర్టోక్‌, హరీశ్‌రావుకు మరదలి స్ర్టోక్‌ తగిలి మతి భ్రమించిందని టీపీసీసీ అధ్య్గక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు.

TPCC president Mahesh Goud: కేటీఆర్‌కు సిస్టర్‌ స్ట్రోక్‌.. హరీశ్‌కు మరదలి స్ట్రోక్‌

  • అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌కు సిస్టర్‌ స్ర్టోక్‌, హరీశ్‌రావుకు మరదలి స్ర్టోక్‌ తగిలి మతి భ్రమించిందని టీపీసీసీ అధ్య్గక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు. అవినీతి, టీ ఆర్‌ఎస్‌ పేరు మార్పుపై కవిత ప్రశ్నలకు దమ్ముంటే కేటీఆర్‌, హరీశ్‌ సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో శనివారం మహేశ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమేనా? అని సవాల్‌ విసిరారు. నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిందన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో 70ు పైగా స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుందని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో 25వేలపైగా మెజారిటీతో గెలిచామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్‌ ప్రజా పాలనకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో 90శాతంపైగా మునిసిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వెలువరించే వార్తా కథనాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి వార్తా కథనాలు శ్రేయస్కరం కాదన్నారు. జిల్లాల పేరు మార్పు సంగతిని పక్కన పెట్టి అభివృద్ది పనుల గురించి మాట్లాడాలని బీజేపీ నేతలకు హితవు చెప్పారు. సినిమా టికెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని అంకమ్మ తల్లి దేవాలయంలో హరిహర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలు, సంక్రాంతి సంబరాల వాల్‌పోస్టర్లను మహేశ్‌గౌడ్‌ ఆవిష్కరించారు. హరిహర ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’పై బీజేపీ కుట్ర: వీహెచ్‌

ఉపాధి పథకాన్ని రద్దు చేసి.. పేదల నోటికాడి ముద్దను లాక్కునేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు ఆరోపించారు. ఉపాధి పథకానికి గాంధీ పేరు కొనసాగించే వరకు కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.

Updated Date - Jan 11 , 2026 | 03:32 AM