Share News

ప్రజా పాలనకు బ్రహ్మరథం: మహేశ్‌ గౌడ్‌

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:14 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఘనవిజయం అందజేసి ప్రజా పాలనకు బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

ప్రజా పాలనకు బ్రహ్మరథం: మహేశ్‌ గౌడ్‌

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఘనవిజయం అందజేసి ప్రజా పాలనకు బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారదర్శక పాలన అందిస్తోందని, ఈ నేపథ్యంలోనే ప్రజలు విశ్వాసంతో కాంగ్రె్‌సకు ఓటు వేశారని చెప్పారు. వరుస విజయాలతో పార్టీపై రాష్ట్రాభివృద్ధి బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు.


4.jpg

రెండేళ్ల పాలనకు ఆమోద ముద్ర: దుద్దిళ్ల

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - Feb 14 , 2026 | 04:14 AM