దేవుడి పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా?
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:44 AM
మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో గెలిచే దమ్ముందా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధ్వజం
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో గెలిచే దమ్ముందా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీజేపీ గాంధీజీని మరిచిపోయి, గాడ్సే జపం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో గాడ్సే రాజ్యాన్ని స్థాపించేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అధికారంలో శాశ్వతంగా ఉండటం కోసం బీజేపీ నేతలు ప్రాంతీయ పార్టీలను చీల్చుతూ, రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారని ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నెహ్రూ, గాంధీ కుటుంబాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకికవాదుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని, వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తంచేశారు.