రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:06 AM
రాజ్యాంగాన్ని మార్చడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో...
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని మార్చడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం 2014 వరకు తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను కేంద్రం తొలగిస్తోందన్నారు. రేవంత్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని విఽకాసం వైపునకు నడిపిస్తున్నారని కొనియాడారు.
రేపటి నుంచి జిల్లాల యాత్ర
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం నుంచి 4రోజుల పాటు జిల్లాల యాత్ర చేపట్టనున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఈ యాత్రను చేపడుతున్నారు. యాత్రలో భాగంగా ఈ నెల 28న మెదక్, మానకొండూరు, 29న వేములవాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో గ్రామ సభల్లో పాల్గొంటారు. 30న ఆలేరు నియోజకవర్గంలో జరిగే గ్రామ సభకు హాజరు కానున్నారు. 31న నకిరేకల్, ఇబ్రహీం పట్నం నియోజకవర్గాలలో నిర్వహించనున్న గామ్ర సభల్లో పాల్గొంటారు. కాగా, స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను అవమానించినందుకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చిన కేటీఆర్‌కు సంస్కారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎంను, స్పీకర్‌ను కించపరిచేలా తెలంగాణ భవన్‌లో నాటకాలు వేయించిన కేటీఆర్‌కు రాజ్యాంగాన్ని తాకే అర్హత లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్ చెప్పారు.