Share News

కొల్లాపూర్‌లో మహేశ్‌బాబు అభిమానుల సందడి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:51 PM

కొల్లాపూర్‌ ప ట్టణంలో తెలుగు సినిమాహీరో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు 51వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా సమా జ సేవా కార్యక్రమాల మధ్య జ రుపుకున్నారు.

కొల్లాపూర్‌లో మహేశ్‌బాబు అభిమానుల సందడి
హీరో మహేశ్‌ బాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న అభిమానులు

- సూపర్‌స్టార్‌ జన్మదినం పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి సందడి

కొల్లాపూర్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్‌ ప ట్టణంలో తెలుగు సినిమాహీరో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు 51వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా సమా జ సేవా కార్యక్రమాల మధ్య జ రుపుకున్నారు. అభిమాన కథా నాయకుడిపై తమకున్న అభి మానాన్ని చాటుకుంటూ పట్ట ణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా ప్రాం గణంలో సందడి చేశారు. ఎన్టీ ఆర్‌ చౌరస్తా వద్ద అభిమానులు కేక్‌ కట్‌ చేశా రు. బాణసంచా కాల్చి, జై మహేశ్‌ బాబు, జో హార్‌ ఘట్టమనేని కృష్ణ అంటూ నినాదాలు చే శారు. స్థానిక అనాథ ఆశ్ర మానికి వెళ్లి పిల్లల కు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆ సుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశా రు. మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షు డు చిన్నా మాట్లాడుతూ మహేశ్‌ బాబు ఎంతో మంది చిన్నారుల గుండె ఆపరేషన్లకు సాయం చేస్తూ రియల్‌ హీరోగా నిలిచారన్నారు. కార్యక్ర మంలో మహేశ్‌బాబు, అభిమా నుల సంఘం విశిష్ట అతిథులు సీనియర్‌ నాయకులు కమలా కర్‌రావు, జగతి నాయుడు, చేపల రాజశేఖర్‌, మాజీ వార్డు మెంబర్‌ శ్రీనివాసులు, వైస్‌ ప్రెసి డెంట్‌ పండు, కోశాధికారి ఇక్రమ్‌, సంఘం ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:51 PM