రూ. లక్షకు శిశు విక్రయం
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:11 AM
తల్లిదండ్రులు లక్ష రూపాయలకు శిశువును విక్రయించిన ఘట న ఇది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం తెలుగుగూడేనికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : తల్లిదండ్రులు లక్ష రూపాయలకు శిశువును విక్రయించిన ఘట న ఇది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం తెలుగుగూడేనికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇప్పటికే కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. జూన్ 16న వారికి జనరల్ ఆసుపత్రిలో మరో మగ శిశువు జన్మించా డు. ఈనెల 13నటీకా వేయడానికి ఇంటికి వెళ్లిన స్థానిక ఆసుపత్రి సిబ్బందికి శిశువు కనిపించలేదు. విషయం తెలుసుకున్న పోలీస్, ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. తల్లిదండ్రు లను విచారించగా.. శిశువును రూ.లక్షకు విక్రయించినట్లు అంగీకరించారు.