kumaram bheem asifabad- ఎస్‌కేఈ కళాశాలకు మహర్దశ
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:18 PM
జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలకు మహార్దశ రానుంది. కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధ నకు అంతా రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 శాతం వాటా కింద ఏర్పాటు చేసిన పథకం పీఎం ఉషా స్కీంతో కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్ల నిధులను గతేడాది క్రితం విడుదల చేసింది.
- విద్యార్థులకు తీరనున్న అవస్థలు
కాగజ్‌నగర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలకు మహార్దశ రానుంది. కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధ నకు అంతా రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 శాతం వాటా కింద ఏర్పాటు చేసిన పథకం పీఎం ఉషా స్కీంతో కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్ల నిధులను గతేడాది క్రితం విడుదల చేసింది. ఈ నిధులతో టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు వేగంగా కొనసాగుతున్నా యి. రాష్ట్రంలోనే అత్యధిక అడ్మిషన్లు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుర్తింపు పొందడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రూ.5 కోట్లతో ఆధునిక సౌకార్యలతో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు నిర్మిస్తున్నారు. వీటి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కార్పొరేషన్ తీసుకుంది. రూ.5 కోట్లలో రూ.3.5 కోట్లు జీప్లస్‌వన్‌లో విశాలమైన ఎనిమిది అదనపు తరగతి గదుల నిర్మాణాలకు కేటాయించారు. రూ.1.5 కోట్లతో ఇప్పటికే 200 డెస్క్ బెంచీలు, 50 కంప్యూటర్లు, ప్రింటర్స్, 26 డిజిటల్‌స్మార్ట్, బోర్డులు, ఫర్నిచర్, ల్యాబ్ మెటిరియ్‌స్మార్ట్, బోర్డులు, ఫర్నిచర్, తదితర వాటిని సమకూర్చనున్నారు. పనులు పూర్తయితే అన్ని హంగులతో కార్పొరేట్ స్థాయిలో డిగ్రీ విద్య అందనుంది.
- ఐదెకరాల విస్తీర్ణంలో..
ఐదెకరాల విస్తీర్ణంలో 1982లో ఎస్‌కేఈ(సిర్పూరు కాగజ్‌నగర్ ఎంప్లాయీస్) డిగ్రీ కళాశాల ను ప్రైవేటు మేనేజ్‌మెంటు ప్రారంభించింది. 2019లో అధ్యాపకుల కొరత, విద్యార్ధుల ప్రవే శాలు తగ్గడంతో ప్రభుత్వం ఎస్‌కేఈ కళాశాలను మూసి వేసింది. విద్యార్థి, ఉద్యోగ సంఘాల కృషి అప్పటి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కళాశాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాగజ్‌నగర్ డిగ్రీ కళాశాలగా గుర్తింపు తెచ్చారు. 2019-20 విద్యా సంవత్సరంలో 137 మంది విద్యార్ధులు ఉండే వారు. అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినరసింహం కృషితో 2024 సంవత్సరంలో ఏకంగా విద్యార్ధుల సంఖ్య 1,100కి చేరుకుంది. దీంతో నూతన భవన నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పించేందుకు ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు రాజేశ్వర్, శారద దేవేందర్‌ల నేతృత్వంలో సమగ్ర ప్రణాళికలను రూపొందించింది. కళాశాల విద్యాశాఖ కమిషనరేట్, రాష్ట్ర ప్రభు త్వానికి నివేదికలను అందజేశారు. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రం ఈ కళాశాలను పీఎం ఉషా పథకానికి ఎంపిక చేసింది. రూ.5 కోట్ల నిధులను గతేడాది మంజూరు చేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 శాతం వాటా ఉండడం విశేషం. ప్రస్తుతం కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కంప్యూటర్స్, బీజడ్‌సీ గ్రూపులతో పాటు సీబీసీఎస్ విధానంలో విద్యార్థి తనకు నచ్చిన సబ్టెక్టును ఎంచుకునేందుకు వెసులు బాటు కల్పించారు. బీఏ కంప్యూటర్స్, బీజడ్సీ కంప్యూటర్స్ లాంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
పనులు కొనసాగుతున్నాయి..
-శ్రీదేవి, ప్రిన్సిపాల్
పీఎం ఉషా పథకంలో రూ.5 కోట్ల నిధులు విడుదల కావడంతో. పనులు కూడా వేగంగా కొనసాగుతు న్నాయి. పనులు పూర్తయితే విద్యార్థులకు మౌలిక వసతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.