kumaram bheem asifabad- కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Nov 22 , 2026 | 09:54 PM
ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల పారిశ్రామ ప్రాంతాల ప్రజలకు కీలక రవాణా కేంద్రంగా ఉన్న ఈ స్టేషన్ ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ రూ.36 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది.
- తీరనున్న ప్రయాణికుల కష్టాలు
కాగజ్‌నగర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల పారిశ్రామ ప్రాంతాల ప్రజలకు కీలక రవాణా కేంద్రంగా ఉన్న ఈ స్టేషన్ ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ రూ.36 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ అభివృద్ధి పనులు పూర్తి అయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ పర్యటించారు. ప్రస్తుతం రెండో, మూడో నంబర్ ప్లాట్ ఫారాలపై ప్రయాణికులు ఎదుర్కొం టున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు డీఆర్ఎంకు వివరించారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాట్లు చేయడంతో పాటు స్టేషన్ భవనం, పార్కింగ్, ప్లాట్‌ఫారాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఆర్ఎం కూడా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ రూ.36 కోట్ల నిధులు విడుదుల చేశామని చెప్పారు. త్వరలోనే టెండర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు కష్టపడుతున్న ప్రయాణికులు సమస్యలు తీరనున్నాయి. 2, 3 ప్లాంట్ ఫారంపై కూడా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితో పాటు ఈ ప్లాట్ ఫాంరపై కూడా పూర్తి స్థాయిలో షెడ్ల నిర్మాణం కాక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ఇబ్బంది పడుతూ వర్షంలో తడువాల్సిన పరిస్థితి ఉందని పలువురు చెబుతు న్నారు. అభివృద్ధి నిధులు విడుదల కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.