Share News

నేడు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:42 AM

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శనివారం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు రానున్నారు.

నేడు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శనివారం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు రానున్నారు. ఈ సందర్భంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌తో పాటు మంచిర్యాల జిల్లాలో బహిరంగ సభ, రోడ్‌షో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సిర్పూర్‌కు ఫడ్నవీస్‌ చేరుకుని 1 గంటకు ఎస్పీఎం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్‌ షెలార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు తదితర ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోని లక్ష్మీనారాయణ మందిర్‌ నుంచి ప్రారంభించే రోడ్‌షో ముక్రామ్‌ చౌరస్తా, అర్చనా టెక్‌ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్‌ రోడ్‌ గుండా ప్రయాణించి మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముగియనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 07 , 2026 | 04:42 AM