Share News

జూన్‌ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్‌ కార్డులు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:15 AM

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సం బంధించి రాష్ట్ర మహిళలకు ప్రభు త్వం త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులను జారీ చేయనుంది.

జూన్‌ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్‌ కార్డులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సం బంధించి రాష్ట్ర మహిళలకు ప్రభు త్వం త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులను జారీ చేయనుంది. జూన్‌ 2వ తేదీ నుంచి మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం రూ.75 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఉపయోగించుకునేందుకు మహిళలు తమ ఆధార్‌ కార్డును బస్‌ కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులు అందుబాటులోకి వస్తే వాటి సాయంతోనే ఉచిత ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:15 AM