Share News

ఈనెల 17న కల్వకుర్తిలో మహాధర్నా

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:31 PM

డిం డి లిఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 17న కల్వకుర్తిలో ని ర్వహించనున్న మహా ధ ర్నాను జయప్రదం చేయా లని జేఏసీ నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి కోరారు.

ఈనెల 17న కల్వకుర్తిలో మహాధర్నా
ఊర్కొండలో మహాధర్నా కరపత్రాలను విడుదల చేస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు

- జేఏసీ నాయకుడు జనార్దన్‌రెడ్డి

ఊర్కొండ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : డిం డి లిఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 17న కల్వకుర్తిలో ని ర్వహించనున్న మహా ధ ర్నాను జయప్రదం చేయా లని జేఏసీ నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి కోరారు. ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల జేఏసీ నాయ కుల ఆద్వర్యంలో కల్వకుర్తిలో ఈ నెల 17న నిర్వహించనున్న మహాధర్నా కరపత్రాలను బు ధవారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్‌ నీటిని అక్రమంగా డిండి లిఫ్ట్‌ పేరుతో నల్ల గొండ జిల్లాకు తరలించే పనులు వెంటనే నిలు పుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌ఎల్‌ ఐ పనులు చేయడానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి అయినప్పుడు దాని లోనే భాగమైన డిండి లిఫ్ట్‌ పనులు ఎట్లా కొన సాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ధర్నాను జ యప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్‌ మ్యాకల శ్రీనివాసులు జేఏ సీ నాయకులు సదానందంగౌడ్‌, కానుగుల జం గయ్య, కొమ్ము శ్రీను, గోపి, మల్లేష్‌, సందీప్‌, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:31 PM