Share News

ఓటమి భయంతోనే మహాదేవప్ప ఆత్మహత్య

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:55 AM

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన మక్తల్‌ మునిసిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది.

ఓటమి భయంతోనే మహాదేవప్ప ఆత్మహత్య

  • ఫిర్యాదులో భార్య వెల్లడి

  • తాజాగా వెలుగులోకి ఫిర్యాదు కాపీ

మక్తల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన మక్తల్‌ మునిసిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. మహాదేవప్ప ఓటమి భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య సత్యమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై తమకు ఎలాంటి అనుమానమూ లేదని, తమ వార్డులోని వారు ఓటు వేయరనే భయంతోనే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు కాపీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే పోలీసులు బీఎన్‌ఎ్‌స 194 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మహాదేవప్ప భార్య అంతకుముందు ఓ న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. తన భర్తకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కానీ ఫిర్యాదులో అందుకు భిన్నంగా పేర్కొనడం చర్చనీయాంశమైంది.

Updated Date - Feb 13 , 2026 | 04:55 AM